Tuesday, December 18, 2007

లూసియానా జంటహత్యలపై దర్యాప్తునకు రంగంలోకి దిగిన ఎఫ్‌.బి.ఐ. Andhra Jyothy

అమెరికాలోని లూసియానా విశ్వవిద్యాలయంలో పి.పెచ్‌.డి. చేస్తూ గుర్తు తెలియని దుండగుల చేతుల్లో దుర్మరణం పాలైన కిరణ్‌ కుమార్‌ అల్లం, చంద్రశేఖర్‌ రెడ్డి కొమ్మ జంటహత్యల దర్యాప్తునకు ఎఫ్‌.బి.ఐ. రంగంలోకి దిగింది.
ఈ కేసు విషయంలో ఇంతవరకూ ఎటువంటి గట్టి ఆధారాలూ దొరకకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. హంతకులు ప్రొఫెషనల్‌ హంతకులు అని సర్వత్రా భావిస్తున్నా హంతకులు అసలు ఎందుకింత ఘోరానికి పాల్పడ్డారన్న ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. హంతకులు ఒక్కరినే హతమార్చడానికి వచ్చారా, లేక ఇద్దరినీ హత మార్చే ఉద్దేశంతో వచ్చారా అని ఇప్పుడు ఎఫ్‌.బి.ఐ. దర్యాప్తు జరపబోతున్నది. హంతకులకు సంబంధించి ఇప్పటివరకూ అందిన ఒకే ఒక్క సమాచారం వారు కిరణ్‌ కుమార్‌ అల్లం ఇంటికి కొంత దూరంలో కారు నిలిపి ఉంచారు, వారు మొత్తం ముగ్గురు నల్ల జాతీయులు, కారులో ఒక వ్యక్తి అప్పటికే ఉన్నారు, లైట్లు లేకుండానే వారు పారిపోయారు, కారు ప్రధాన రహదారిలో కలిసిన తర్వాత లైట్లు వేసుకున్నారు -- ఇంతవరకే ఇప్పటివరకూ బయటకు వచ్చిన సమాచారం.
ఇప్పుడు ఎఫ్‌.బి.ఐ. రంగంలోకి దిగడంతో దర్యాప్తు చకచక జరగగలదని స్థానిక ప్రవాస తెలుగువారు భావిస్తున్నారు. ఈ కేసులో అన్ని కోణాలనుంచీ దర్యాప్తు చేయడానికి వీలుగా హత్య జరిగిన అల్లం ఇంట్లోకి పోలీసులు ఎవరినీ రానివ్వడంలేదు. మరో రెండు మూడు రోజుల్లో కేసు ఒక కొలిక్కి రావచ్చునని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాలపై ఆస్పత్రిలో నిర్వహించిన శవపరీక్ష నివేదికలు ఏ క్షణాన్నయినా బయటకు రావచ్చునని ఆస్పత్రి వర్గాల ద్వారా తెలుస్తున్నది. మృతదేహాలను మాత్రం శుక్రవారంనాటికి హైదరాబాద్‌కు తరలించవచ్చునని భావిస్తున్నారు.

4 comments:

Unknown said...

పరువు హత్య
ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ 24 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని భివండి ప్రాంతంలో చోటుచేసుకుంది.అయితే పోలీసులు దీన్ని పరువు హత్యగా అనుమానిస్తున్నారు. find more news @ spiceandhra

Unknown said...

nice blog
www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel

biograpys said...

Nice Blog .
For more telugu news visit TrendingAndhra

sam said...

పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు Online Breaking News Telugu