Monday, December 17, 2007

అమెరికాలో తెలుగు విద్యార్దుల మృతికి ఆటా ఘన నివాళి andhra jyothi

లూసియానా, డిసెంబర్‌ 17 : లూసియానా విశ్వవిద్యాలయంలో ఇద్దరు తెలుగు విద్యార్దుల మృతిపట్ల అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) విచారం వ్యక్తం చేసింది. అమెరికాలోని లూసియానా విశ్వవిద్యాలయంలో గురువారం అర్దరాత్రి చంద్రశేఖర్‌ కొమ్మ (31), అల్లం కిరణ్‌ కుమార్‌ (33)లు దారుణ హత్యకు గురైన విషయం తమను విస్మయానికి గురి చేసిందంటూ ఆటా ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ఆటా సభ్యులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆటా తరపున మృతుల కుటుంబాలకు ఎటువంటి సహాయం చేయడానికైనా సిద్దమని సభ్యులు తెలిపారు. ఈ కేసును పోలీసులు, ఎఫ్‌బిఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు వేగవంతం కాలేదని వారు అభిప్రాయపడుతున్నారు. తెలుగు విద్యార్దులను హత్య చేసినట్లుగా భావిస్తున్న ముగ్గురు నల్లజాతి యువకులు ఎందుకోసం ఈ దారుణానికి ఒడిగట్టారో తెలియకపోవడం శోచనీయమని ఆటా ప్రతినిధులు అన్నారు. మరోపక్క లూసియానా తెలుగు విద్యార్దుల సంఘం చంధ్రశేఖర్‌, కిరణ్‌ కుమార్‌ పేర్ల మీదుగా స్మారక నిధి ఏర్పాటు చేసి వారి పేరుతో అర్హులైన పేద విద్యార్దులకు వితరణ అందించాలని సంకల్పించింది. సహచర విద్యార్దుల మృతిపట్ల తాము షాక్‌కు గురయ్యామని, ఇటువంటి సంఘటనలు దురదష్టకరమని లూసియానా విశ్వవిద్యాలయంలోని తెలుగు విద్యార్దులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, అమెరికాలో మతిచెందిన తెలుగు విద్యార్దుల కుటుంబాలకు తగిన సహాయం అందించాలని ఆటా సంకల్పించింది. ఇందుకు గానూ ఆటా అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రా రెడ్డి గవ్వా తక్షణ సహాయంగా భాదిత కుటుంబాలకు 5,000 డాలర్ల ఆర్దిక సహాయాన్ని ప్రకటించారు. ఆటా సభ్యులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తల ద్వారా నిధులు సమీకరించి మతులను ప్రత్యేక విమానంలో భారత్‌లోని వారి స్వగ్రామాలకు పంపే ఏర్పాటు చేస్తామని చంద్రారెడ్డి తెలిపారు. లూసియానా విశ్వవిద్యాలయం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని భావిస్తున్నట్లు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి తెలిపారు.

2 comments:

Unknown said...

Telangana - News గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి

- హారం ప్రచారకులు.

Unknown said...

nice implementation article
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel