Sunday, December 16, 2007

తెలుగువెలుగుల్ని చిదిమిందెవరు? Andhra Jyothy 16-12-07

లూసియానా హత్యలపై వీడని మిస్టరీ
హూస్టన్‌, డిసెంబర్‌ 15: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు అల్లంకిరణ్‌కుమార్‌, చంద్రశేఖర్‌రెడ్డి హత్యోదంతం ఇటు భారత్‌లో, అటు అమెరికాలో కలకలం సృష్టించింది. దీనికి ఒడిగట్టింది ఎవరు? ఇది కేవలం దోపిడీ దొంగల పనేనా? లేక జాతి వివక్ష కోణమేమైనా ఉన్నదా? తదితర అనేక సందేహాలు, ప్రస్తుతానికి జవాబులేని ప్రశ్న ల్లా కనిపిస్తున్నాయి. ఇదో మిస్టరీలా మారింది. అమెరికాలో ఉంటున్న తెలుగువారితో పాటు, ఇక్కడ ఉంటున్న వారి కుటుంబాలు కూడా జరిగిన దారుణంతో దిగ్భ్రాంతికి గురయ్యాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం లూసియానా స్టేట్‌ యూనివర్సిటీ అపార్ట్‌మెంట్లో అల్లంకిరణ్‌ (33), చంద్రశేఖర్‌రెడ్డి (31) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇద్దరూ పీహెచ్‌డీ చేస్తున్నారు. జరి గిన దారుణంపై దర్యాప్తునకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేసింది. ఎఫ్‌బీ ఐ, స్టేట్‌ పోలిస్‌ దీనికి సహకరిస్తున్నా యి.
హంతకులు ఎవరన్న దానిపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరా తీస్తున్నారు. 'మరణ శిక్ష' అమలు చేసిన తరహాలో పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో జరిపిన ఈ కాల్పులకు ముగ్గురు నల్లజాతి యువకులు బాధ్యులని అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఘటన తర్వా త వారు హడావుడిగా అక్కణ్నుంచి వెళ్లిపోవడం చూశామనీ కొందరు తెలిపారు. అయితే అనుమానితులు ముగ్గురు కాదనీ, నలు గురనీ తాజా కథనం. "అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు వచ్చిన తర్వా త ముగ్గురు నల్లజాతి యువకులు ఓ కార్లో ఎక్కారు. అందులో కచ్చి తంగా నాలుగో వ్యక్తి (డ్రైవర్‌ సీట్లో) ఉండి ఉంటాడు. ముగ్గురు ఆగంతకులు ఎక్కిన వెంటనే ఆపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ నుంచి కారు దక్షిణం వైపు బయల్దేరింది. దాని హెడ్‌లైట్లను ఆఫ్‌చేసి ఉంచారు. కొద్దిదూరం వెళ్లాక మళ్లీ హెడ్‌లైట్లను వెలిగించారు'' అని టాస్క్‌ఫోర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.
దుండగుల కోసం వేట మొదలైంది. లూసి యానా స్టేట్‌ యూనివర్సిటీ అధికారులు మొదట ఈ హత్యల్ని, సాధారణంగా జరిగే దోపిడీ, హింసాత్మక సంఘటనల్లో భాగంగా పేర్కొన్నారు. పోలీసులు అదే అనుకుంటున్నట్టు చెప్పారు. అయితే తాజాగా ఈ ప్రకటనను వారు వెనక్కి తీసుకున్నారు. "అంతుబట్టని కొన్ని కారణాల వల్ల, ఈ ఇద్దరిని లక్ష్యంగా చేసుకుని చంపినట్టు'' వా రు కొత్త ప్రకటన విడుదల చేశారు. "ఇది ఎప్పుడూ జరిగే మా మూలు దోపిడీ/ హింసాత్మక సంఘటనల్లా అనిపించడం లేదు'' అని వర్సిటీ చాన్స్‌లర్‌ సీన్‌ ఓ కీఫ్‌ విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. ఆయన నాసా మాజీ సారథి కూడా. పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలియవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ఇద్దరు విద్యార్థుల్ని కోల్పోవడం వర్సిటీకి తీరని నష్టమని ఆయన పేర్కొ న్నారు.
అల్లం కిరణ్‌ భార్య, చంద్రశేఖర్‌ భార్య తమ విశ్వవిద్యాలయ విద్యార్థులు కారనీ, అయినా వారికి ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించేందుకు తాము సిద్ధమనీ ఆయన తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. ఆయన తాజా అనుమానానికి కొంత ప్రాతి పదిక ఉంది. సాధారణంగా పి.హెచ్‌డి. విద్యార్థులు బొటాబొటి జీవి తం గడుపుతుంటారు. వారిదగ్గర దోచుకోవడానికి పెద్దగా ఏమీ ఉం డదు. అదీగాక కాల్పులు జరిగిన అల్లంకిరణ్‌ అపార్ట్‌మెంట్లోకి ఆగంత కులు బలవంతంగా ప్రవేశించిన దాఖలాలు కూడా లేవు. ఇంట్లో దోపిడీ జరిగినట్టుగా కూడా ఆధారాలేమీ లేవని తెలుస్తోంది. అయితే దోపిడీ జరిగినట్టుగా ఒక అధికారి చెప్పినట్టు మరో వార్తా సంస్థ పేర్కొంది. అధికారులు దీనిపైనా దర్యాప్తు జరుపుతున్నారు. సుమా రు 10 మంది పోలీసు అధికారులు రోజంతా అపార్ట్‌మెంట్లోనే గడిపి ఆధారాలు సేకరించారు. చంద్రశేఖర్‌రెడ్డి కూడా వివాహితుడు. భార్యతో పాటే అదే వర్సిటీ ప్రాంగణంలో నివసిస్తారు. ఆయన అల్లంకిరణ్‌ అపార్ట్‌మెంట్‌కు వచ్చినపుడు ఇద్దరూ హత్యకు గురయ్యారు.
జంట హత్యలతో యుని వర్సిటీ క్యాంపస్‌లో భయానక వాతావరణం ఏర్పడంది. అయితే ఫైనల్‌ పరీక్షల కోసం క్యాంపస్‌ను తెరిచే ఉంచారు. అధికారులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హూస్టన్‌లోని ఇండియన్‌ కాన్సు లేట్‌ ఇప్పటికే వర్సిటీ అధికార వర్గాలతో సంప్రదింపులు జరిపింది. మరోవైపు భారత రాయబార కార్యాలయం నుంచి ఇద్దరు ఉన్నతాధి కారులు కె.పి.పిళ్లై, అలోక్‌పాండే వర్సిటీకి, పోలీసు అధికారుల వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. అమెరికాలో భారత రాయబారి రోనెన్‌సేన్‌ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అల్లం కిరణ్‌, చంద్రశేఖర్‌ కుటుంబాలను ఆదుకునేందుకు లూసియా నా స్టేట్‌ వర్సిటీ ఒక సహాయ నిధి (ఫౌండేషన్‌)ని ఏర్పాటు చేసింది. సహాయాన్నిఎలా అందజేయాలనే వివరాలు వర్సిటీ వెబ్‌సైట్లో ఉన్నట్టు పేర్కొంది.

మృత దేహాల తరలింపుపై నేడు నిర్ణయం
హైదరాబాద్‌: కాగా కిరణ్‌ తండ్రి, ప్రముఖ రచయిత అల్లం రాజ య్య శుక్రవారం రాత్రే హైదరాబాద్‌ నుంచి అమెరికాకు పయనమ య్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయానికి ఆయన లూసియానా స్టేట్‌ వర్సిటీ చేరుకోవచ్చు. ఆ తర్వాతే కిరణ్‌ మృతదేహాన్ని భారత్‌ తీసుకువెళ్లాలా? లేదా? తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని మాత్రం భారత్‌కు రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరు కుంటున్నారు.

No comments: