Tuesday, December 18, 2007
లూసియానా జంటహత్యలపై దర్యాప్తునకు రంగంలోకి దిగిన ఎఫ్.బి.ఐ. Andhra Jyothy
ఈ కేసు విషయంలో ఇంతవరకూ ఎటువంటి గట్టి ఆధారాలూ దొరకకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. హంతకులు ప్రొఫెషనల్ హంతకులు అని సర్వత్రా భావిస్తున్నా హంతకులు అసలు ఎందుకింత ఘోరానికి పాల్పడ్డారన్న ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. హంతకులు ఒక్కరినే హతమార్చడానికి వచ్చారా, లేక ఇద్దరినీ హత మార్చే ఉద్దేశంతో వచ్చారా అని ఇప్పుడు ఎఫ్.బి.ఐ. దర్యాప్తు జరపబోతున్నది. హంతకులకు సంబంధించి ఇప్పటివరకూ అందిన ఒకే ఒక్క సమాచారం వారు కిరణ్ కుమార్ అల్లం ఇంటికి కొంత దూరంలో కారు నిలిపి ఉంచారు, వారు మొత్తం ముగ్గురు నల్ల జాతీయులు, కారులో ఒక వ్యక్తి అప్పటికే ఉన్నారు, లైట్లు లేకుండానే వారు పారిపోయారు, కారు ప్రధాన రహదారిలో కలిసిన తర్వాత లైట్లు వేసుకున్నారు -- ఇంతవరకే ఇప్పటివరకూ బయటకు వచ్చిన సమాచారం.
ఇప్పుడు ఎఫ్.బి.ఐ. రంగంలోకి దిగడంతో దర్యాప్తు చకచక జరగగలదని స్థానిక ప్రవాస తెలుగువారు భావిస్తున్నారు. ఈ కేసులో అన్ని కోణాలనుంచీ దర్యాప్తు చేయడానికి వీలుగా హత్య జరిగిన అల్లం ఇంట్లోకి పోలీసులు ఎవరినీ రానివ్వడంలేదు. మరో రెండు మూడు రోజుల్లో కేసు ఒక కొలిక్కి రావచ్చునని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాలపై ఆస్పత్రిలో నిర్వహించిన శవపరీక్ష నివేదికలు ఏ క్షణాన్నయినా బయటకు రావచ్చునని ఆస్పత్రి వర్గాల ద్వారా తెలుస్తున్నది. మృతదేహాలను మాత్రం శుక్రవారంనాటికి హైదరాబాద్‌కు తరలించవచ్చునని భావిస్తున్నారు.
Monday, December 17, 2007
అమెరికాలో తెలుగు విద్యార్దుల మృతికి ఆటా ఘన నివాళి andhra jyothi
Sunday, December 16, 2007
ఎందుకు చేశారో...! తెలుగుబిడ్డల హత్యోదంతం.. అంతుబట్టని కారణం


మృతదేహాలను తెప్పించే ఏర్పాట్లు హత్యకు గురైన చంద్రశేఖర రెడ్డి, కిరణ్‌కుమార్‌ల మృతదేహాలను రాష్ట్రానికి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్, విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో, అమెరికాలో భారత రాయబారి రొనెన్ సేన్‌తో మాట్లాడారు. ''మృతదేహాలను తెచ్చే విషయమై మేము అమెరికా రాయబార కార్యాలయంతో మాట్లాడుతున్నాం. కిరణ్‌కుమార్ తండ్రి అల్లం రాజయ్య ఇప్పటికే అమెరికాకు బయలుదేరివెళ్లారు. లూసియానా గవర్నర్ బాబీ జిందాల్‌తో అక్కడి తెలుగు సంఘం సమావేశమైంది'' అని మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. మృతదేహాలను తెప్పించే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులు లూసియానాకు వెళ్లారని ఆయన చెప్పారు. బంధువులెవరైనా అమెరికాకు వెళ్తామంటే వారి ప్రయాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు.
కుటుంబాలను పరామర్శించండి
కిరణ్‌కుమార్, చంద్రశేఖరరెడ్డిల కాల్చివేతపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్, విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన వారిని హతమార్చడం విషాదకరమన్నారు. కిరణ్‌కుమార్, చంద్రశేఖరరెడ్డిల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరామర్శించాల్సిందిగా కరీంనగర్, కడప జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖరరెడ్డి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. మృతదేహాలను రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణను ఆదేశించారు.
తెలుగువెలుగుల్ని చిదిమిందెవరు? Andhra Jyothy 16-12-07

హూస్టన్, డిసెంబర్ 15: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు అల్లంకిరణ్కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి హత్యోదంతం ఇటు భారత్‌లో, అటు అమెరికాలో కలకలం సృష్టించింది. దీనికి ఒడిగట్టింది ఎవరు? ఇది కేవలం దోపిడీ దొంగల పనేనా? లేక జాతి వివక్ష కోణమేమైనా ఉన్నదా? తదితర అనేక సందేహాలు, ప్రస్తుతానికి జవాబులేని ప్రశ్న ల్లా కనిపిస్తున్నాయి. ఇదో మిస్టరీలా మారింది. అమెరికాలో ఉంటున్న తెలుగువారితో పాటు, ఇక్కడ ఉంటున్న వారి కుటుంబాలు కూడా జరిగిన దారుణంతో దిగ్భ్రాంతికి గురయ్యాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం లూసియానా స్టేట్ యూనివర్సిటీ అపార్ట్మెంట్లో అల్లంకిరణ్ (33), చంద్రశేఖర్‌రెడ్డి (31) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇద్దరూ పీహెచ్డీ చేస్తున్నారు. జరి గిన దారుణంపై దర్యాప్తునకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఎఫ్బీ ఐ, స్టేట్ పోలిస్ దీనికి సహకరిస్తున్నా యి.
హంతకులు ఎవరన్న దానిపై టాస్క్‌ఫోర్స్ అధికారులు అరా తీస్తున్నారు. 'మరణ శిక్ష' అమలు చేసిన తరహాలో పాయింట్ బ్లాంక్ రేంజ్లో జరిపిన ఈ కాల్పులకు ముగ్గురు నల్లజాతి యువకులు బాధ్యులని అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఘటన తర్వా త వారు హడావుడిగా అక్కణ్నుంచి వెళ్లిపోవడం చూశామనీ కొందరు తెలిపారు. అయితే అనుమానితులు ముగ్గురు కాదనీ, నలు గురనీ తాజా కథనం. "అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వా త ముగ్గురు నల్లజాతి యువకులు ఓ కార్లో ఎక్కారు. అందులో కచ్చి తంగా నాలుగో వ్యక్తి (డ్రైవర్ సీట్లో) ఉండి ఉంటాడు. ముగ్గురు ఆగంతకులు ఎక్కిన వెంటనే ఆపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి కారు దక్షిణం వైపు బయల్దేరింది. దాని హెడ్లైట్లను ఆఫ్‌చేసి ఉంచారు. కొద్దిదూరం వెళ్లాక మళ్లీ హెడ్లైట్లను వెలిగించారు'' అని టాస్క్‌ఫోర్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
దుండగుల కోసం వేట మొదలైంది. లూసి యానా స్టేట్ యూనివర్సిటీ అధికారులు మొదట ఈ హత్యల్ని, సాధారణంగా జరిగే దోపిడీ, హింసాత్మక సంఘటనల్లో భాగంగా పేర్కొన్నారు. పోలీసులు అదే అనుకుంటున్నట్టు చెప్పారు. అయితే తాజాగా ఈ ప్రకటనను వారు వెనక్కి తీసుకున్నారు. "అంతుబట్టని కొన్ని కారణాల వల్ల, ఈ ఇద్దరిని లక్ష్యంగా చేసుకుని చంపినట్టు'' వా రు కొత్త ప్రకటన విడుదల చేశారు. "ఇది ఎప్పుడూ జరిగే మా మూలు దోపిడీ/ హింసాత్మక సంఘటనల్లా అనిపించడం లేదు'' అని వర్సిటీ చాన్స్‌లర్ సీన్ ఓ కీఫ్ విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. ఆయన నాసా మాజీ సారథి కూడా. పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలియవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ఇద్దరు విద్యార్థుల్ని కోల్పోవడం వర్సిటీకి తీరని నష్టమని ఆయన పేర్కొ న్నారు.
అల్లం కిరణ్ భార్య, చంద్రశేఖర్ భార్య తమ విశ్వవిద్యాలయ విద్యార్థులు కారనీ, అయినా వారికి ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించేందుకు తాము సిద్ధమనీ ఆయన తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. ఆయన తాజా అనుమానానికి కొంత ప్రాతి పదిక ఉంది. సాధారణంగా పి.హెచ్డి. విద్యార్థులు బొటాబొటి జీవి తం గడుపుతుంటారు. వారిదగ్గర దోచుకోవడానికి పెద్దగా ఏమీ ఉం డదు. అదీగాక కాల్పులు జరిగిన అల్లంకిరణ్ అపార్ట్మెంట్లోకి ఆగంత కులు బలవంతంగా ప్రవేశించిన దాఖలాలు కూడా లేవు. ఇంట్లో దోపిడీ జరిగినట్టుగా కూడా ఆధారాలేమీ లేవని తెలుస్తోంది. అయితే దోపిడీ జరిగినట్టుగా ఒక అధికారి చెప్పినట్టు మరో వార్తా సంస్థ పేర్కొంది. అధికారులు దీనిపైనా దర్యాప్తు జరుపుతున్నారు. సుమా రు 10 మంది పోలీసు అధికారులు రోజంతా అపార్ట్మెంట్లోనే గడిపి ఆధారాలు సేకరించారు. చంద్రశేఖర్‌రెడ్డి కూడా వివాహితుడు. భార్యతో పాటే అదే వర్సిటీ ప్రాంగణంలో నివసిస్తారు. ఆయన అల్లంకిరణ్ అపార్ట్‌మెంట్‌కు వచ్చినపుడు ఇద్దరూ హత్యకు గురయ్యారు.
జంట హత్యలతో యుని వర్సిటీ క్యాంపస్‌లో భయానక వాతావరణం ఏర్పడంది. అయితే ఫైనల్ పరీక్షల కోసం క్యాంపస్‌ను తెరిచే ఉంచారు. అధికారులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హూస్టన్‌లోని ఇండియన్ కాన్సు లేట్ ఇప్పటికే వర్సిటీ అధికార వర్గాలతో సంప్రదింపులు జరిపింది. మరోవైపు భారత రాయబార కార్యాలయం నుంచి ఇద్దరు ఉన్నతాధి కారులు కె.పి.పిళ్లై, అలోక్‌పాండే వర్సిటీకి, పోలీసు అధికారుల వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. అమెరికాలో భారత రాయబారి రోనెన్‌సేన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అల్లం కిరణ్, చంద్రశేఖర్ కుటుంబాలను ఆదుకునేందుకు లూసియా నా స్టేట్ వర్సిటీ ఒక సహాయ నిధి (ఫౌండేషన్)ని ఏర్పాటు చేసింది. సహాయాన్నిఎలా అందజేయాలనే వివరాలు వర్సిటీ వెబ్సైట్లో ఉన్నట్టు పేర్కొంది.
మృత దేహాల తరలింపుపై నేడు నిర్ణయం
హైదరాబాద్: కాగా కిరణ్ తండ్రి, ప్రముఖ రచయిత అల్లం రాజ య్య శుక్రవారం రాత్రే హైదరాబాద్ నుంచి అమెరికాకు పయనమ య్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయానికి ఆయన లూసియానా స్టేట్ వర్సిటీ చేరుకోవచ్చు. ఆ తర్వాతే కిరణ్ మృతదేహాన్ని భారత్ తీసుకువెళ్లాలా? లేదా? తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని మాత్రం భారత్‌కు రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరు కుంటున్నారు.
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల కాల్చివేత AndhraJyothy 15-12-07

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు విద్యాసుమాలు నేలరాలాయి. విద్యార్జనకు వెళ్లిన ఇద్దరు యువకులు అర్ధాంతరంగా తనువు చాలించారు. దుండగుల తూటాలకు బలయ్యారు. మృతులను అల్లం కిరణ్ కుమార్, కొమ్మ చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తించారు. కిరణ్ ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య ఏకైక కుమారుడు. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా మంథని మండలంలోని గాజులపల్లి. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కడప జిల్లా లింగాలకు చెందినవారు.
హైదరాబాద్, డిసెంబర్ 14 (ఆన్లైన్): దుండగుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయిన కిరణ్, చంద్రశేఖర్‌లు అమెరికాలోని లూసియానా వర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నారు. ఇద్దరూ మిత్రులు. కిరణ్‌కు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. భార్య స్వప్న ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. చంద్రశేఖర్ కూడా వివాహితుడే.ఆయన భార్య అక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు. పెళ్లయిన వారు నివసించడానికి యూనివర్సిటీలో ప్రత్యేకించిన అపార్ట్‌మెంట్స్‌లో వీరు ఉంటున్నారు. కిరణ్ తన భార్యతోపాటు మరో ఇంట్లో ఉన్నా... రీసెర్చ్ పని ఉన్నప్పుడు రాత్రిళ్లు వర్సిటీ అపార్ట్మెంట్లోనే ఉంటుంటారు.
గురువారం రాత్రి చంద్రశేఖర్ కూడా కిరణ్ అపార్ట్మెంట్లోనే ఉన్నారు.ముగ్గురు దుండగులు ఇంట్లోకి చొరబడి... వచ్చీ రాగానే కాల్పులు జరిపారు. చంద్రశేఖర్ మెడకు కేబుల్ తీగ చుట్టి మరీ చంపారు. ఇద్దరి తలల్లో ఒక్కో బుల్లెట్ పేల్చారు. కిరణ్ మృతదేహం తలుపు వద్ద పడి ఉంది. ఆయన భార్య స్వప్న రాత్రి 10.30 గంటల సమయంలో వర్సిటీ అపార్ట్‌మెంట్‌కు వచ్చారు.భర్త, అతని మిత్రుడు విగత జీవులై ఉండటం చూసి ద్రిగ్భాంతికి గురయ్యారు. లూసియానా వర్సిటీ పోలీసులకు ఫోన్ చేసిసమాచారం అందించారు. ముగ్గురు దుండగులు అపార్ట్మెంట్ నుంచి పారిపోవడం చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డబ్బుకోసం ఉన్మాదుల్లా ప్రవర్తించే వారే ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం గాలిస్తున్నారు.
అక్కడే నేరాలు ఎక్కువ...లూసియానా వర్సిటీ సుమారు 2వేల ఎకరాల్లో విస్తరించింది. పెళ్లయిన వారికి కేటాయించిన అపార్ట్మెంట్స్.. క్యాంపస్‌కు ఓ చివరన విసిరేసినట్లు ఉంటాయి. అక్కడ నేరాలు కూడా అధికం.భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ కార్యాలయం ఈ అపార్ట్‌మెంట్స్‌కు కూత వేటు దూరంలోనే ఉంటుంది. లూసియానా వర్సిటీలో సుమారు 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జార్జియాటెక్ వర్సిటీ కాల్పుల తర్వాత అమెరికాలోని యూనివర్సిటీలో ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. అనుకోని సంఘటనలు జరిగితే పోలీసులను అప్రమత్తం చేసేలా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని వర్సిటీ విద్యార్థులందరికీ సూచించారు. లూసియానా వర్సిటీలోనూ ఫోన్ ద్వారా ఈ మెసేజ్ పంపారు. కానీ... ఇందుకు 8 వేల మంది మాత్రమే స్పందించినట్లు తెలిసింది.
జూన్‌లో వచ్చేస్తానని...కిరణ్ కుమార్ ఐదేళ్లుగా డాక్టరేట్ చేస్తున్నారు. అది ముగింపు దశకు చేరుకుంది. జూన్‌లో భారత్‌కు వచ్చి... ఇక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నారు. అంతలోనే ఈ దారుణం జరిగింది. కిరణ్ విద్యాభ్యాసం మంచిర్యాల, హైదరాబాద్, వరంగల్‌లలో సాగింది. అతని ఇద్దరు సోదరీమణులు రజని, స్వప్నలు కూడా అమెరికాలో ఉన్నారు. సోదరి స్వప్న గర్భవతి కావడంతో ఆమెకు తోడుగా ఉండేందుకు తల్లి శోభ కూడా అక్కడికి వెళ్లారు. కిరణ్ మృతి వార్త తెలియగానే ఆయన బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. తండ్రి రాజయ్య హుటాహుటిన హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు.
పది నెలల క్రితమే...దుండగుల చేతిలో మరణించిన మరో యువకుడు చంద్రశేఖర్ రెడ్డి తండ్రి సాంబశివారెడ్డి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన కడప జిల్లా వెలిదండ్ల గ్రామంలో భూములు కొని స్థిరపడ్డారు. ఆయన ముగ్గురు కుమారుల్లోఒకరు హైదరాబాద్‌లో, మరొకరు కర్నూలులో ఉన్నారు. ఇంకో కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి పది నెలల క్రితమే అమెరికా వెళ్లారు. ఆయన భార్య కూడా అక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు. కిరణ్, చంద్రశేఖర్‌ల మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. సంఘటన వివరాలు తెలుసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
అమెరికాలో ఇద్దరు ఆంధ్ర యువకుల హత్య Eenadu 15-12-07

అమెరికాను తూట్లు పొడుస్తున్న తుపాకీ సంస్కృతి తెలుగు బిడ్డలను పొట్టన బెట్టుకుంది. మేధకు విలువనిచ్చే గడ్డగా నమ్మి కోటి ఆశలతో పరిశోధన విద్యార్థులుగా అమెరికాను చేరిన కిరణ్, చంద్రశేఖరరెడ్డిలు లూసియానా విశ్వవిద్యాలయంలో దారుణ హత్యకు గురయ్యారు. కొత్తగా పెళ్లయిన చంద్రశేఖర్, త్వరలో తండ్రవుతున్న కిరణ్‌ల కుటుంబాల్లో నిన్నటి వరకు అంబరాన్నంటే ఆనందం... నేడు కటిక చీకటిలాంటి విషాదం. ఈ దారుణం అమెరికా ప్రవాసాంధ్రులను... రాష్ట్రంలోని వారి కుటుంబాలను కలవర పెడుతోంది.
బేటన్ రూగ్ (లూసియానా)

అమెరికాలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ యువకులు దారుణ హత్యకు గురయ్యారు. లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న అల్లం కిరణ్‌కుమార్, కొమ్మా చంద్రశేఖరరెడ్డిలను గుర్తుతెలియని దుండగులు చంపారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు అపార్ట్మెంటులోకి చొరబడి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ప్రఖ్యాత తెలుగు రచయిత అల్లం రాజయ్య కుమారుడు. చంద్రశేఖరరెడ్డిది కడప జిల్లా పులివెందుల. ఇద్దరూ స్నేహితులు. 29-30 ఏళ్ల వయసుంటుంది. వివాహితులు కూడా. కిరణ్ రసాయన శాస్త్రంలో, చంద్రశేఖరరెడ్డి బయోటెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్నారు. భార్యలతో విశ్వవిద్యాలయం ఆవరణలోని వేర్వేరు అపార్ట్మెంట్లలో ఉంటున్నారు. ఉభయుల ఇళ్ల నడుమ దూరం నాలుగు మైళ్లవరకు ఉంటుంది. ఎడ్వర్డ్ గే కాంప్లెక్స్‌లోని కిరణ్‌కుమార్ అపార్ట్మెంటులో ఈ హత్యలు జరిగాయి. చంద్రశేఖరరెడ్డిని కేబుల్ తీగలతో బంధించి తలపై కాల్చారు. కిరణ్ తలపైనా కాల్చారు. ఆయన మృతదేహం ద్వారం వద్ద పడిఉంది. కిరణ్ భార్య స్వప్న (ప్రస్తుతం గర్భిణి) బయట నుంచి ఇంటికొచ్చాక వీరి మృతదేహాలను కనుగొని పోలీసులకు సమాచారం అందించారని చంద్రశేఖరరెడ్డి స్నేహితుడు పోతకమూరి శ్రీనివాస్ తెలిపారు. ముగ్గురు ఆగంతకులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోతూ కనిపించారని, వారికోసం గాలిస్తున్నామని, ఇంతవరకు ఎవరినీ అరెస్టుచేయలేదని పోలీసులు వెల్లడించారు. చంద్రశేఖరరెడ్డికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లయింది. భార్య పేరు కల్పన. ఆమె శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని తన తండ్రి దామోదర్‌రెడ్డికి ఫోను చేసి సంఘటన గురించి చెప్పారు. ముగ్గురు నల్లజాతీయులు కాల్పులు జరిపినట్లు ఆమె తెలిపారు. లూసియానా విశ్వవిద్యాలయంలో ఇలాంటి సంఘటన జరగడం 1990 తర్వాత ఇదే మొదటిసారి అని విశ్వవిద్యాలయ ప్రతినిధి క్రిస్టీన్ కొలోన్ తెలిపారు. క్యాంపస్‌లో 30 వేల మంది విద్యార్థులున్నారు. వారి నివాసాల్లో ఏదైనా జరగరానిది జరిగితే అత్యవసరంగా సమాచారం పంపే అప్రమత్త వ్యవస్థను ఈ మధ్యనే ఏర్పాటుచేశారు. వర్జీనియాటెక్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది మొదట్లో ఓ వ్యక్తి 32 మందిని చంపి తానూ కాల్చుకున్న ఘటన తర్వాత ఈ వ్యవస్థను అందరు విద్యార్థులకు తప్పనిసరి చేశారు. కొందరికి మాత్రం ఈ సదుపాయం అందలేదు. ఎందుకిలా జరిగిందో దర్యాప్తు జరుపుతున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. ఒకరికి కొత్తగా పెళ్లి.. మరొకరు తండ్రి కాబోతున్నారు
మధుర వూహల వేళ మరణ మృదంగం సొంత వూళ్లో అలముకున్న విషాదం
కర్నూలు, మంథని, లింగాల, న్యూస్‌టుడే: అమెరికాలోని లూసియానా విశ్వవిద్యాలయంలో హత్యకు గురయిన తెలుగుబిడ్డలు కె.చంద్రశేఖర్‌రెడ్డి, అల్లం కిరణ్‌ల సొంత వూళ్లయిన కర్నూలు, కరీంనగర్ జిల్లా మంథనిలలో విషాదం అలముకొంది. ఇద్దరూ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అత్యంత ఆనందకర స్థాయులను అందుకున్న తరుణంలో జరిగిన ఈ సంఘటన ఆప్తులకు మింగుడు పడటంలేదు.
కరవుసీమ నుంచి పరిశోధన విద్యార్థిగా అమెరికా వెళ్లిన చంద్రశేఖర్ మరణం కుటుంబానికి పిడుగైంది. కళ్లల్లో ఉబికివస్తోన్న కన్నీళ్లు... హృదయాంతరాల్లో సుడులు తిరుగుతోన్న దుఃఖాన్ని... గొంతు దాటకుండా... పెదవి విప్పకుండా... ఆరు గంటలుగా ఆ కుటుంబం పడుతోన్న వేదన అంతాఇంతా కాదు. గొంతులోని భావం... నోట వెంట మాటగా మారితే... తండ్రి ప్రాణానికి పెద్ద ఇబ్బంది కావడంతో ఆ కుటుంబం నిజాన్ని దాచి నిస్తేజంగా కుమిలిపోతోంది. తొమ్మిది నెలల కిందట తన చేతులు మీదుగా మరిది పెళ్లి చేసిన ఆ వదినకు... ఆ తీపి జ్ఞాపకాలు ఇంకా వీడక ముందే శరాఘాతం.. చంద్ర మరణవార్తతో చేష్టలుడిగిన ఆమె ఆక్రోశానికి అంతు లేదు. ఓదార్చేందుకు వస్తోన్న ఇరుగు-పొరుగును ఇంట్లో పరిస్థితి చెప్పలేక ఎనిమిదో తరగతి చుదువుతున్న చిన్నారి కష్టాలు అన్నీఇన్నీ కావు.
చదువు పూర్తయి: కర్నూలుకు చెందిన కె. చంద్రశేఖర్‌రెడ్డి(బుజ్జి) ఉన్నత విద్యను అభ్యసించడానికి ఐదేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కల్పనతో తొమ్మిది నెలల కిందటే వివాహం జరిగింది. ఆ సమయంలో కర్నూలు వచ్చిన ఆయన నెల రోజులపాటు ఇక్కడే ఉండి... భార్యతో అమెరికాకు వెళ్లిపోయారు. పదిరోజుల కిందటే పీహెచ్డీ పూర్తి అయి... డాక్టరేట్ వచ్చినట్లు తమకు ఫోన్ చేసినట్లు బుజ్జి రెండో అన్న విశ్వనాధరెడ్డి చెప్పారు. కడపజిల్లా పులివెందులకు సమీపంలోని వెలిదెండ్ల గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి మూడో కుమారుడే ఈ చంద్రశేఖర్. అటవీశాఖలో ఉద్యోగం చేసేందుకు 30 ఏళ్ల కిందట ఆయన కర్నూలుకు వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డారు. బుజ్జికి ఇద్దరు అన్నలు. ఇద్దరు అక్కలున్నారు. ఒకరు మినహా మిగిలిన వారందరూ హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తోన్నారు.
ఆ ఇబ్బందితో..: గుర్తుతెలీని దుండగుల కాల్పుల్లో మరణించిన వార్త విని చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్థాణువులయ్యారు. వెంటనే ఇంట్లోని కేబుల్ వైర్‌ని కట్ చేశారు. 'నాన్నకు గుండె ఆపరేషన్ చేశారు. హఠాత్తుగా తమ్ముడి గురించి చెబితే ఆయనకేమైనా కావొచ్చు. అందుకే ఇప్పటి వరకూ ఏమీ చెప్పలేదు. సమయానికి అమ్మ కూడా లేదు. పొలం పనులు చూసేందుకు వూరికి వెళ్లింది. ఆమెకు కూడా తమ్ముడి విషయం చెప్పకుండా... అక్కకు ఒంట్లో బాగోలేదు... హైదరాబాద్‌కు వెళ్లాలని చెప్పాం. ఆమె వూరి నుంచి బయలుదేరింది' అంటూ అన్న విశ్వనాధరెడ్డి చెప్పారు. బుజ్జి మరణవార్త గురించి మీడియాలో వచ్చిన కథనాలతో తెలుసుకున్న ఇరుగు.. పొరుగు పరామర్శించేందుకు రావడంతో 'ఇంట్లో పరిస్థితిని' వివరించి బయటనుంచే పంపిస్తున్నారు. తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పారు.
తల్లిదండ్రులను అమెరికా తీసుకెళ్లాలని: 'అమ్మా.. నాన్నా.. మీకు ఇక ఏ కష్టమూ రాదు. నేనున్నాను.. మిమ్మల్ని కూడా అమెరికా తీసుకెళ్తాను' అని తల్లిదండ్రులతో చెప్పిన చంద్రశేఖర్‌రెడ్డి వారిని అక్కడికి తీసుకువెళ్లకుండానే తుపాకీ తూటాలకు బలయ్యాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. మా ఇద్దరినీ అమెరికా తీసుకెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవలే చెప్పాడని మృతుని తల్లిదండ్రులు సాంబశివారెడ్డి, మీనాక్షమ్మ కన్నీళ్లపర్యంతమవుతూ చెప్పారు. ప్రయోజకుడవుతున్నాడని సంతోషంతో వూగిసలాడుతున్న వారికి కుమారుని మరణవార్త గుండెలు పగిలేలా తాకింది. మరో రెండు నెలల్లో తమ్ముడి దగ్గరకు అమ్మా, నాన్నలు వెళ్లనున్నట్లు విశ్వనాథరెడ్డి చెప్పారు. 'ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది' అంటూ ఉబికి వస్తోన్న కన్నీళ్లను ఆపుకొంటూ చెప్పారు. తమ తమ్ముడి భౌతికకాయాన్ని తమకు అప్పగిస్తారా? ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకుంటుందా? అంటూ ఆ అన్నా... వదినలు అడుగుతున్న తీరు గుండెల్ని పిండేలా ఉంది.
తోబుట్టువులు అక్కడే: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కిరణ్ మృతి ఆయన సొంత వూరయిన కరీంనగర్ జిల్లా మంథని మండలం గాజులపల్లి ప్రజల్ని కలచివేసింది. కిరణ్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఇంటర్, వరంగల్‌లో డిగ్రీ, హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ చదివారు. నాలుగేళ్ల క్రితం లూసియానా విశ్వవిద్యాలయంలో పారిశ్రామిక రసాయన శాస్త్రంలో పరిశోధన కోసం వెళ్లి పూర్తి చేశారు. వచ్చే ఏడాది జూన్‌లో స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. కిరణ్ భార్య స్వప్న ప్రస్తుతం గర్భిణి. కిరణ్ తల్లి, అక్కాచెల్లెళ్లు రజని, చందన, బావలు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కిరణ్ బంధువులు మంథనిలో శోక సముద్రంలో మునిగారు. కిరణ్ తండ్రి అల్లం రాజయ్య(విరసం సభ్యుడు) హుటాహుటిన శుక్రవారం రాత్రి అమెరికా బయల్దేరివెళ్లారు.హైదరాబాద్‌కు చెందిన స్వప్నతో రెండేళ్ల క్రితం కిరణ్‌కు వివాహం జరిగింది. కిరణ్ నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు